ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం

– ఇద్దరు ఐఏఎస్‌లకు నోటీసులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డి సెంబర్‌ 11: ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్‌పై ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆర్టీఐ చట్టం కింద సమాచారం అందజేయలేదని జీహెచ్‌ఎం‌సీ మాజీ కమిషనర్‌ ‌కె.ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్‌ ఆర్‌.‌వి.కర్ణన్ లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆర్టీఐ చట్టం ప్రకారం పిటిషనర్‌ అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో గతంలో సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేటకు చెందిన వడ్డం శ్యామ్‌ ‌హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వెంటనే అడిగిన సమాచారం ఇవ్వాలని నవంబర్‌ 24‌న ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని శ్యామ్‌ ‌మరోసారి కోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ జరిపిన ధర్మాసనం ఐఏఎస్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోవద్దో తెలపాలని మండిపడింది. కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరిస్తూ జనవరి 26న కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేకాక కోర్టు ఉత్తర్వులు పాటించకపోతే జరిమానా విధిస్తామని ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు ధర్మాసనం హెచ్చరిక జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page