న్యూదిల్లీ, అక్టోబర్ 8: తీరసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025కు నోబెల్ ఫ్రైజ్ ప్రకటించారు. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి చేసినందుకు సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎమ్ యాఫీులకు నోబెల్ బహుమతిని అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. వీరు కొత్త రకం మాలిక్యులర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్లు నోబెల్ కమిటీ వెల్లడిరచింది. గతేడాది కూడా రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. ప్రొటీన్లపై విశేష పరిశోధనలు చేసిన డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్‌లు ఈ పురస్కారం అందుకున్నారు. 1901I2024 మధ్య 116సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించగా ఇప్పటివరకు 195మంది అందుకున్నారు. సోమవారం మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన ఈనెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. తొలుత వైద్య శాస్త్రంలో, మంగళవారం భౌతిక శాస్త్రంలో విజేతలను ప్రకటించారు. గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి, 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్నవారి పేర్లను ప్రకటిస్తారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులు అందజేస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





