తాను ఉన్నంతవరకు కాంగ్రెస్‌లోకి కెసిఆర్‌ను రానివ్వను
తెలంగాణకు ప్రథమ శతృవు కెసిఆర్ కుటుంబమే
తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి
హైదరాబాద్‌కు వొచ్చాక మంత్రులకు శాఖల కేటాయింపు
డియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి
తను ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోకి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువని మండిపడ్డారు. దిల్లీలో డియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై దిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం చెప్పారు. హైదరాబాద్ వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామని తెలిపారు. కర్ణాటక కులగణనపై మాత్రమే అధిష్ఠానం వద్ద చర్చలు జరిగాయన్నారు. కాళేశ్వరంపై రెండు రోజుల్లో డియా సమావేశం నిర్వహిస్తానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం డాక్యుమెంట్లు అన్నింటినీ బయటపెడతానన్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతోంది కిషన్‌రెడ్డేనని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ ఆయన నిధులు సాధించలేదని విమర్శించారు. కొత్త మంత్రులపై శాఖల కేటాయింపుపై సీఎం స్పష్టత ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలను కొత్త మంత్రులకు ఇస్తానని చెప్పారు. బుధవారం డియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో కొన్ని నెలల వరకు మంత్రి పదవులు ఇవ్వలేదని, ఇచ్చినప్పటికీ శాఖలను కేటాయించలేదన్నారు. తాను మాత్రం రెండు మూడు రోజులకే శాఖలను కేటాయించినట్లు చెప్పారు. అలాగే కేసీఆర్ కుటుంబంపై సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులని, తాను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. కులగణన సమయంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కిషన్ రెడ్డి అందరి నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి వివరాలు స్వీకరించాలని హైదరాబాద్ కలెక్టర్‌కు ప్రత్యేకంగా సూచించినట్లు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, హరీష్ రావు సర్వేలో వివరాలు పంచుకోలేదన్నారు. కాళేశ్వరంలో ఏం జరిగింది, కాళేశ్వరంపై తనకు ఉన్న అభిప్రాయాలను రెండు మూడు రోజుల్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూడా ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అడ్డుపడుతుంది కిషన్ రెడ్డే అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకు వస్తే వారితో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డితో సక్ష చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏ రోజైనా తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి నివేదిక ఇచ్చారా కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ అంశాలను ఎప్పుడైనా కేంద్రమంత్రి ప్రస్తావించారా అంటూ నిలదీశారు. నిర్మల సీతారామన్ చెన్నైకు మెట్రో తీసుకువెళ్లారని.. ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారని.. తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏ తీసుకురాలేదని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతీ అభివృద్ధి కార్యక్రమానికి కిషన్ రెడ్డి అడ్డుగా ఉన్నారన్నారు. తెలంగాణ మంత్రివర్గం విస్తరణలో సామాజిక న్యాయం పాటించామని.. 55 శాతం మేరకు ఇప్పటికే పదవులు కేయించామన్నారు. నక్సలిజానికి అంతం ఉండదని.. సామాజిక అసమానతలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.