బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ గా నితిన్ బాధ్యతల స్వీకరణ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన బీహార్ మంత్రి నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. కార్యాలయానికి చేరుకున్న నబిన్ కు అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, దిల్లీ సీఎం రేఖ గుప్తా సహా ప‌లువురు నాయకులు ఘనంగా స్వాగతం ప‌లికారు. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు.  తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి నబిన్ మాట్లాడుతూ త‌న‌లాంటి చిన్న కార్యకర్తకు పార్టీ చాలా పెద్ద బాధ్యత అప్పగించిందన్నారు. కార్యకర్తల నిబద్ధత, కృషిని పార్టీ గుర్తిస్తుందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. దివంగత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కొడుకే నబీన్. కాయస్త కమ్యూనిటీకి చెందిన ఆయన ఇప్పటివరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో ఆయన తండ్రి కిశోర్ మరణంతో పాట్నా వెస్ట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు బీజేపీ అధిష్టానం నితిన్ ను నిలబెట్టింది. అప్పటి నుంచి రెండు దశాబ్దాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బంకీపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న నబిన్ బీహార్ ప్రజా పనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ని నియమించింది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగాను ఆయనకు బాధ్యతలు అప్ప‌గించే అవ‌కాశం ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page