– రైతులకు మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: తమ పంటను మార్కెట్ యార్డుకు లేదా జిన్నింగ్ మిల్లుకు అమ్ముకోవడానికి తీసుకొచ్చేందుకు ముందు పత్తిలో తేమ 12శాతం మించకుండా చూసుకోవాలని వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. 12 శాతం మించినట్టయితే కనీస మద్ధతు ధర పొందే అవకాశం ఉండదంటూ మార్కెట్ యార్డు లేదా జిన్నింగ్ మిల్లులకు రాకముందే తేమ శాతాన్ని సరిచూసుకోవాలని కోరారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా పత్తి పంటను కొనాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, ఇందుకు సంబంధించి ఈనెల 25న కేంద్ర ఔళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహన్‌కు 8వ లేఖ రాశామని తెలిపారు. తమ ప్రభుత్వం పత్తి రైతులకు గరిష్ట మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు పత్తి రైతు సోదరులు తమ పత్తిని అమ్ముకునేముందు తేమ శాతాన్ని 12కు మించకుండా చూసుకోవాలని సాచించారు. కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిక బృందాలు జిల్లాల్లో పర్యటిస్తుంటాయని, ఏఈఓలు, మార్కెట్ సెక్రటరీలు, జిల్లా మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని, ఎలాంటి సమస్యలున్నా అందుబాటులో ఉన్న అధికారులను సంప్రదించాలని, అలాగే మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779ని సంప్రదించాలని మంత్రి తుమ్మల రైతులను కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





