రాయ్‌పూర్, అక్టోబర్ 29: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 20మందిపై మొత్తంగా రూ.66 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు. 51మందిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) బెటాలియన్ నెంబర్01 మరియు నెంబర్లు 01,02 మరియు 05కు చెందిన ఐదుగురు సభ్యులు, ఏరియా కమిటీ మరియు గ్రూప్‌కు చెందిన ఏడుగురు సభ్యులు ఉన్నారు. స్థానిక సంస్థ స్క్వాడ్ (ఎల్‌ఒఎస్) గ్రూప్‌కు చెందిన ముగ్గురు సభ్యులు, ఒక మావోయిస్టు గ్రూప్ కమాండర్, మావోయిస్టుల బృందానికి చెందిన 14మంది సభ్యులు, 20మంది దిగువ స్థాయి సభ్యులు ఉన్నారని బీజాపూర్ ఎస్‌పి తెలిపారు. 2024 జనవరి నుండి, బీజాపూర్‌లో మొత్తం 650మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరారని, ఎన్‌కౌంటర్లలో 196మంది మరణించారని అన్నారు. 986మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





