ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23: ఏ ఎన్నిక జరిగినా బీజేపీదే విజయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వానికి అండగా నిలిచినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మహావికాస్ అఘాడీ కూటమి విద్వేషాలు ప్రచారం చేశారని విమర్శించారు. ఎంవీఏ కూటమిని ప్రజలు నమ్మలేదన్నారు కిషన్ రెడ్డి. మహారాష్ట్ర ప్రజలు వారసత్వం చూడలేదన్నారు మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి వోట్లు, సీట్లు భారీగా పెరిగాయన్నారు కిషన్ రెడ్డి. శరద్ పవార్ శకం ముగిసిందన్నారు.
కాంగ్రెస్ కులం, మతం పేరుతో ప్రచారం చేసిందని.. మహారాష్ట్ర, జార?ండ్ లో కలిపి కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. మహారాష్ట్రలో సీఎం ఈవీఎం కుట్ర అంటూ కాంగ్రెస్ కూటమి నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. సంజయ్ రౌత్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. కర్ణాటక, జార?ండ్, తెలంగాణలో గెలిచినప్పుడు ఈవీఎంలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ మూడు రాష్ట్రాలకే పరిమితమైందని కేటీఆర్ విమర్శించారు.