హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేసే విధంగా రాత్రింబవళ్లు జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరో వేయేండ్ల వరకు నిలిచిపోయేలా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. అంతకుముందు గుడి చుట్టూ కలియ తిరిగి పనులు జరుగుతున్న తీరును అక్కడి కూలీలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడారానికి విచ్చేసిన మంత్రి సీతక్కకు అధికారులు ఘన స్వాగతం పలికారు. జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల శ్రీ సమ్మక్కIసారలమ్మ పూజారులు సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ చివరి నాటికి పూర్తి అయ్యేలా పనులు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





