- బిఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ లోనే కరప్షన్
- మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
- శాసనమండలిలో కవిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్
ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు. మాకు దిఢిల్లీ వ్యాపారాలు తెలియవు. దిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది.. మీ కుటుంబమే.. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కరప్షన్‌కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్.. మహిళలకు అడుగడుగునా అన్యాయం చేసింది బీఆర్ఎస్సే’’ అంటూ సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు. మాకు దిల్లీ వ్యాపారాలు తెలియవు. దిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది.. మీ కుటుంబమే.. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కరప్షన్‌కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్.. మహిళలకు అడుగడుగున అన్యాయం చేసింది బీఆర్ఎస్సే’’ అంటూ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు, మహిళా కమిషన్ కు సభ్యులు లేరు. మహిళలు పొదుపు చేసుకున్న 1800 కోట్ల అభయహస్తం నిధులు ఇవ్వలేదు. పావలా వడ్డీ ఇవ్వలేదు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన 3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదు. తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే, రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారు. మేము పంట కాలువలు మూసివేసినట్లుగా బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. బిఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ లోనే కరప్షన్ ఉంది. ఇష్టానుసారంగా ఎస్టిమేషన్ పెంచి దోచుకుతున్నారు. మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారు? మీరు చేయలేని ఉద్యోగాల భర్తీ మేం చేస్తున్నాం. 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. మీరు అన్ని చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు.
బిఆర్ఎస్ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాలేదు. మీరు మొదటి సారి అధికారంలోకి వొచ్చినప్పుడు 63 సీట్లతో వచ్చారు. మేము 65 సీట్లతో అధికారులకు వొచ్చాం. పదేళ్లలో ఎన్ని ఇండ్లు ఇచ్చారు? ప్రజలకు ఇండ్లు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మేము వొచ్చి 15 నెలలు అయింది.. అప్పుడే అన్నీ కావాలన్నట్లు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు.. వారి పేరు స్కీమ్స్ కి పెడితే ఎందుకంత కడుపుమంట మీరు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఎన్నో హామీలు తుంగలో తొక్కారు. రాష్ట్రం పరువు తీసింది మీరే.. తప్పుడు ప్రచారం చేయొద్దు అని మంత్రి సీతక్క హితువు పలికారు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా అప్పల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు.