మానసిక దివ్యాంగులకూ హక్కులు ఉంటాయి

– డిస్ట్రిక్ట్‌ జడ్జి డాక్టర్‌ పట్టాభిరామారావు

హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: మానసిక దివ్యాంగులకు అన్ని హక్కులూ ఉంటాయని, ముఖ్యంగా ఆస్తి హక్కు కూడా ఉంటుందని జిల్లా జడ్జి డాక్టర్‌ పట్టాభిరామారావు తెలిపారు. అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్‌ అనితా రెడ్డి అద్యక్షతన డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసు హన్మకొండ ఆద్వర్యంలో వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే సందర్భంగా కాజీపేటలోని బన్ను మనో వికాస కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల హక్కుల‌పై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్‌ పటాభిరామారావు హాజరు కాగా, విశిష్ట అతిథిగా డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీస్‌ అధారిటీ కార్యదర్శి క్షమ దేశ్‌పాండే, ప్రత్యేక గౌరవ ఆత్మీయ అతిథిగా డాక్టర్‌ అనితా రెడ్డి పాల్గొన్నారు, జిల్లా జడ్జి డాక్టర్‌ పట్టాభిరామారావు ప్రసంగిస్తూ ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ప్రేమను పంచాలని అన్నారు. మానసిక దివ్యాంగులైన చిన్నారులకు ఎలాంటి అవసరాలున్నా వారికి కోర్టు తరపున ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. వారికి గుర్తింపు కార్డులు, పెన్షన్‌ కార్డుల ప్రక్రియ సులభతరం చేయాలని, మానసిక నిపుణులు సందర్శించి వీరికి సేవలందించేలా సంబంధించిన అధికారులకు డి.ఎల్‌.ఎస్‌.ఎ తరపున లేఖలు రాస్తామని చెప్పారు, డాక్టర్‌ అనితా రెడ్డి, క్షమాదేష్‌ పాండే త‌దిత‌ర‌ అతిథులు మాట్లాడుతూ దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని అన్నారు మానసిక దివ్యాంగుల హక్కులను కాపాడటం మన బాధ్యత అన్నారు, వారిని హేళన చేయడం, పిచ్చి వారు అనడం, కొట్టడం, కట్టివేయడం వంటివి చేస్తే శిక్షార్హులవుతారన్నారు. హనుమకొండ జిల్లాలోని దివ్యాంగుల సంస్థలన్నీ ఒక వేదిక మీదకు వచ్చి సమస్యలు వివరిస్తే ఫలితాలు బాగుంటాయన్నారు. దివ్యాంగులకు ఓర్పుతో విద్య నేర్పుతూ మానసిక పరిపక్వత వచ్చేలా కృషి చేస్తున్న సంస్థలను అభినందించారు. కార్యక్రమంలో సివిల్‌ జడ్జి డి.డబ్ల్యు.ఓ జయంతి, సంస్థ నిర్వాహకులు చంద్రజిత్‌ రెడ్డి, కిరణ్‌ కుమారి, నీత, ఈ.వి.శ్రీనివాస్‌, రాము, రవికిరణ్‌, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page