హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో వెరిఫికేషన్ జరగనుంది. విద్యార్హత, కమ్యూనిటీనిటీ, తదితర అన్ని సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని బోర్డు పేర్కొంది. ఈ నెల 22, 23వ తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరు కాలేని వారు ఈ నెల 25న వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చునని బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 34 డిపార్ట్‌మెంట్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, అనస్థీషియా డిపార్ట్‌మెంట్లలోని 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. ఆయా పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇటీవలే నియామక పత్రాలు కూడా అందజేశారు. మిగిలిన 30 విభాగాలలోని 433 పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టును మంగళవారం విడుదల చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల జాబితాను విడుదల చేస్తామని బోర్డు తెలిపింది.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




