– హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఎంపిక
కాజిపేట, ప్రజాతంత్ర, జూలై 17: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీ నిర్వహిస్తున్న టెక్-బీ ప్రోగ్రాం కోసం ఈనెల 18న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఐసీఎస్సెస్ కంప్యూటర్ కేంద్రంలో అర్హత పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఈ ఎంపికకు 2025-2026 విద్యా సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ ఏ గ్రూపులో ఇంటర్ పూర్తి చేసినా అర్హులేనని, ఇంటర్ పరీక్షల్లో 75% మార్కులుండాలని తెలిపారు. టెక్-బీ ప్రోగ్రాంలో ఎంపికైన వారికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతోపాటు డిగ్రీ కూడా పూర్తి చేసుకోవచ్చన్నారు. జీతం సంవత్సరానికి రూ.2.2 నుండి రూ.2.5 లక్షలు ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆండ్రాయిడ్ మొబైల్ వెంట తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా ఇన్‌చార్జి నరేష్ (7569177071/79818 34205)ను సంప్రదించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




