ఘటనా స్థలం వద్ద లేక విడుదల
భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు ఇన్ ఫార్మర్ నెపంతో హతమార్చారు. పంచాయతీ కార్యదర్శి రమేష్ మరియు అర్జున్ లను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తుంది. ఈ హత్య తామే చేసామని సంఘటన స్థలం వద్ద లేఖ ఉంచినట్లు తెలిసింది. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తున్నారని నెపంతో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనపై వాజేడు మండల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.
మావోయిస్టులు అతి దారుణంగా ఇద్దరు వ్యక్తులను చంపడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు ఇటువంటి దుచ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మొహరింపజేసింది. దీని కారణంగా ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.
తమ సమాచారం ఏ విధంగా బయటకు వెళ్తుందని ఆలోచనలో పడ్డారు. తమకు అనుమానం వచ్చిన వారితో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు వ్యక్తులను హతమార్చడంపై మావోయిస్టులపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.