ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో, జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (DVF), పోలీస్ బలగాలు గురువారం 29న కుంజం హిడ్మా (Kunjam Hidma ) ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించి హిడ్మాను పట్టుకున్నారు, మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అరెస్టు సమయంలో, భద్రతా బలగాలు హిడ్మా వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 35 తుపాకీ గుళ్లను, 27 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 90 నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, సుమారు 2 కిలోల గన్‌పౌడర్, మావోయిస్టు సాహిత్యం, రేడియోలు, వాకీ-టాకీలు, మందులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.