మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

– ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎదుట లొంగిపోయిన ఆశన్న
– మరో 140మంది కూడా ..

రాయ్‌పూర్‌, అక్టోబర్‌ 16: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ ఎదుట లొంగిపోయాడు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్‌ అభయ్‌ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆ మరుసటిరోజే ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆశన్న జనజీవన స్రవంతిలో కలిశారు. ఆయనతో పాటు మరో 130మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరందరినీ బీజాపూర్‌ పోలీసులు బస్సులో తరలించారు. ఈ క్రమంలో లొంగిపోయిన నక్సలైట్లందరూ తమ వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించారు. వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు ఆయుధాలు వదిలి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. అగ్ర నేతలు కూడా సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ముగించి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. లొంగిపోయిన వారిలో సతీష్‌ అలియాస్‌ టి.వాసుదేవరావు సహా పదిమంది సీనియర్‌ మావోయిస్టులు ఉన్నారు. రాణిత, భాస్కర్‌, నీలా అలియాస్‌ నందే, దీపక్‌ పాలో సహా మరికొందరు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. వీరిలో వాసుదేవరావు తలపై రూ.కోటి రివార్డు ఉండగా మరికొందరిపై లక్షల్లో రివార్డులు ఉన్నట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page