– బిసి రిజర్వేషన్ల జీఓ విడుదలతో లైన్ క్లీయర్
- మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహణ
– తొలుత ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలు
– తరవాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక
– వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుముదిని
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్29: తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. బిసి రిజర్వేషన్లపై భారీ కసరత్తు జరిగినా చివరకు 42 శాతం బిసి రిజర్వేషన్లకు జివో విడుదల కావడంతో స్థానికఎన్నికలకు అడుగులు పడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, 656 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వివరాలు వెల్లడించారు. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదేరోజు గ్రామ పంచాయతీల వోట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ వోట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్‌ఈసీ తెలిపారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణికుముదిని వివరించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపామన్నారు ఎన్నికల అధికారులు. ఇక ఎన్నికల్లో భాగంగా 565 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరగనున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీమొదటి విడత ఎన్నికలు జగనున్నాయి. ఇక అక్టోబర్ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 31న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 4న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జగనున్నాయి. ఇక చివరగా నవంబర్ 8న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తంగా రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అయితే రాష్ట్రమంతటా ఎన్నికల సందడి మొదలవగా కొన్ని గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోవడం లేదని ఎస్‌ఈసీ ప్రకటించింది. కరీంనగర్, ములుగు జిల్లాల్లో 14 ఎంపీటీసీ, 27 గ్రామ పంచాయతీలకు 246 గ్రామ వార్డులు ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయని స్పష్టం చేశారు. కోర్టు కేసుల కారణంగా ఇక్కడ ఎన్నికల నిర్వహణ సాధ్యం కావడం లేదని, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ స్థానాల్లో ఎన్నికలు జరగబోవని తెలిపారు. ములుగు జిల్లాలోని 25 గ్రామ పంచాయతీలు, కరీంనగర్ జిల్లాలోని 2 పంచాయతీలకు ఎన్నికలు లేవని స్పష్టం చేశారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు- తొలివిడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11
పరిశీలన: అక్టోబర్ 12
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 15
ఎన్నికల తేదీ- అక్టోబర్ 23
వోట్ల లెక్కింపు- నవంబర్ 11
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు- రెండో విడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 15
పరిశీలన: అక్టోబర్ 16
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 19
ఎన్నికల తేదీ- అక్టోబర్ 27
వోట్ల లెక్కింపు- నవంబర్ 11
గ్రామ పంచాయతీ ఎన్నికలు- తొలి విడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 17
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 19
పరిశీలన: అక్టోబర్ 20
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 23
ఎన్నికల తేదీ, ఫలితాలు- అక్టోబర్ 31
గ్రామ పంచాయతీ ఎన్నికలు-రెండో విడత
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 21
చివరి తేదీ: అక్టోబర్ 23
పరిశీలన: అక్టోబర్ 24
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 27
ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 4
గ్రామ పంచాయతీ ఎన్నికలు-మూడో విడత
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 25
చివరి తేదీ: అక్టోబర్ 27
పరిశీలన: అక్టోబర్ 28
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 31
ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 8
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





