హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: బ్రాక్ ప్రతినిధుల బృందం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ఙి శాఖ మంత్రి సీతక్కను సోమవారం కలిసి టీజీఐఎల్‌పీ అమలుపై నివేదించారు. ఇప్పటివరకు మొత్తం 3,554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించినట్లు మంత్రికి తెలిపారు. ఎంపిక చేసిన మండల మహిళా సమాఖ్యల ద్వారా 108 మంది నిపుణులను నియమించి లబ్ధిదారులకు శిక్షణ ఇస్తామన్నారు. టీజీఐఎల్‌పీ ప్రోగ్రామ్ ద్వారా పేద కుటుంబాలకు దీర్ఘ కాలికంగా ఆదాయం వచ్చే మార్గాలు కల్పించి వారికి ఆర్థికంగా స్వావలంబన కల్పించే లక్ష్యంతో పనిచేస్తునట్లు వివరించారు. గ్రెగరీ చెన్, మేనేజింగ్ డైరెక్టర్, అల్ట్రాపూర్ గ్రాడ్యుయేషన్ ఇనిషియేటివ్ శ్వేతా బెనర్జీ (ఇండియా లీడ్), ఉషారాణి (ప్రోగ్రాం లీడ్), వి.రమేష్ (సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్), అభిషేక్ (ప్రోగ్రాం అసోసియేట్) తదితరులు మంత్రితో భేటీ అయిన వారిలో వున్నారు. సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్టొన్నారు. రాష్ట్రంలోని అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఇన్ క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాం (టీజీఐఎల్‌పీ)ను బ్రాక్ అమలు చేస్తున్నది. సెర్ప్ తో కలిసి ఆదివాసీలు, జోగినీలు, ఇతర పేద కుటుంబాల ఆర్దిక సాధికారత కోసం పనిచేస్తున్నది. ఎంపిక చేసిన పేద కుటుంబాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ప్రోత్సాహకాలు, రుణాలు, రాయితీలు అందించి వాటిని స్వయం ఆదాయం పొందే స్థాయికి చేర్చడమే లక్ష్యంగా టీజీఐఎల్‌పీ కృషి చేస్తున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





