డిసెంబర్‌ 9‌వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు

పలు బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. డిసెంబర్‌ 9‌వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయని  ప్రభుత్వం వెల్లడించింది సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్‌ ‌సర్కారు సన్నద్దం చేస్తోంది. ఆర్‌ఓఆర్‌ ‌చట్టాన్ని ఆమోదించాలని చూస్తోంది. రైతు, కులగణన సర్వేపై కూడా సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలతో పాటు మంత్రివర్గ విస్తరణ మీద కూడా ప్రభుత్వం ఫోకస్‌ ‌పెట్టిందని తెలుస్తోంది. డిసెంబర్‌ 7‌వ తేదీతో రేవంత్‌ ‌సర్కార్‌ ఏడాది కాలం పూర్తి చేసుకోనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిసింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వినిపిస్తోంది. కానీ ఆలోపే మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కసరత్తు జరుగుతోందని కూడా సమాచారం అందుతోంది.

మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా ప్రభుత్వం కసరత్తు  చేస్తోందని తెలుస్తోంది. త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్‌, ‌రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్నిపెంచేందుకు రేవంత్‌ ‌సర్కారు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎలక్షన్స్‌కు ముందు పెన్షన్‌, ‌రైతు భరోసాను పెంచితే ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు పార్టీకి మైలేజీ వస్తుందని భావిస్తున్నారట. అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల మీద ఫోకస్‌ ‌పెట్టిన సీఎం రేవంత్‌.. అం‌దుకు అనుగుణంగా కులగణను చేపట్టారు. మరోవైపు కొండపోచమ్మ సాగర్‌ ‌దగ్గరలోని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫామ్‌హౌస్‌పై విచారణ జరిపించాలని నిర్ణయించారు. గత పదేళ్లలో కెసిఆర్‌ ‌ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించి అసెంబ్లీలో వాడీవేడీ చర్చకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page