కర్నూలు బస్సు దుర్ఘటనలో వీడిన మిస్టరీ

– ప్రమాదానికి ముందే బైకర్‌ ‌పడిపోయినట్లు గుర్తింపు
– బైకును తీసే లోపే లాక్కెళ్లిన బస్సు..అంతలోనే ప్రమాదం
– వివరాలు వెల్లడించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ ‌పాటిల్‌

‌కర్నూలు, అక్టోబరు 25 : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మిస్టరీ వీడింది. బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.వేమూరి కావేరి ట్రావెల్స్ ‌బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మంటలు చెలరేగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడిపిన శివశంకర్‌ అనే యువకుడు కూడా మృతి చెందాడు. అయితే, బైక్‌పై శివశంకర్‌ ‌వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా పోలీసులు గుర్తించారు. అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించారు. కేసు వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ ‌పాటిల్‌ ‌డియాకు వెల్లడించారు. శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా బైక్‌ ‌నడుపుతూ చనిపోయిన శివశంకర్‌తో పాటు వెనుకాల కూర్చున్న వ్యక్తి ఎర్రిస్వామి అలియాస్‌ ‌నానిగా గుర్తించాం. అతన్ని పలు కోణాల్లో విచారించాం. ఎర్రిస్వామి, పల్సర్‌ ‌బైక్‌ ‌నడుపుతున్న శివశంకర్‌ ఇద్దరూ కలిసి లక్ష్మీపురం గ్రామం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2గంటలకు తుగ్గలికి బయల్దేరారు. మార్గ మధ్యలో అర్ధరాత్రి 2.24 గంటలకు కియాషోరూమ్‌ ‌సపంలోని ఉన్న పెట్రోల్‌ ‌బంక్‌ ‌వద్ద రూ.300 పెట్రోల్‌ ‌పోయించుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే చిన్నటేకూరు సపంలో శివశంకర్‌ ‌బైక్‌ ‌నడుపుతూ స్కిడ్‌ అయి.. రోడ్డుకు కుడివైపు ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివశంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుక ఉన్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న శివశంకర్‌ను పక్కకు తీసి,  బైక్‌ను తీద్దామనుకునే సరికి అంతలోనే వేగంగా వచ్చిన బస్సు బైక్‌ను ఢీకొని కొద్ది దూరం ఈడ్చు కెళ్లింది. బస్సు కింద మంటలు రావడంతో ఎర్రిస్వామి భయపడి అక్కడి నుంచి తన స్వగ్రామం తుగ్గలి వెళ్లి పోయాడు. బస్సు ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనగిస్తున్నాం అని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ ‌పాటిల్‌ ‌తెలిపారు.

ఆర్‌టిఎ అధికారుల విస్తృత దాడులు : ప్రైవేట్‌ ‌ప్రయాణానికి దూరంగా ప్రజలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 25: ‌కర్నూల్‌ ‌బస్సు ప్రమాదం తరువాత ఆర్టీఏ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. ఫిట్‌నెస్‌ ‌లేని ప్రైవేటు బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు అధికారులు. నిబంధనలు పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు.. 8 బస్సులను సీజ్‌ ‌చేశారు. మరోవైపు కర్నూల్‌ ‌ప్రమాదం తరువాత ప్రైవేటు బస్సుల యాజమాన్యాల్లో కూడా చలనం వొచ్చినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్‌ ‌లేని బస్సులను పెద్ద ఎత్తున నిలిపివేస్తున్న పరిస్థితి. ముందుగా బుక్‌ ‌చేసిన టికెట్లను కూడా ప్రైవేటు ట్రావెల్స్ ‌రద్దు చేస్తున్నాయి. వీకెండ్‌ ‌కావడంతో ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణికులు భారీగా బుకింగ్‌ ‌చేసుకున్నారు. అయితే ఫిట్‌నెస్‌ ‌లేని బస్సులు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టఏ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో భారీగా బస్సులను యాజమాన్యాలు నిలిపివేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్టాల్రతో పాటు బెంగళూరులో కూడా ఆర్టీఏ అధికారులు భారీగా బస్సులను సీజ్‌ ‌చేస్తున్నారు. తెలంగాణలో వారం రోజులు పాటు స్పెషల్‌ ‌డ్రైవ్‌లు కొనసాగునున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ ‌బస్సులు పెద్ద ఎత్తున బుకింగ్‌లను రద్దు చేయడంతో ఆర్టీసీకి గిరాకీ పెరిగింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page