హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హర్యానాలోని ప్రముఖ ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆహ్వానం అందింది.విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషించడంతోపాటు వారిని ఉద్దేశించి ‘డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్’ ఇవ్వాలని యూనివర్సిటీ కేటీఆర్‌ను ఆహ్వానించింది. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సి. రాజ్ కుమార్ ఈ మేరకు కేటీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. కేటీఆర్ రాక, ఆయన ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తాయని పేర్కొన్నారు. కేటీఆర్‌కు అనుకూలమైన తేదీ, సమయాన్నిబట్టి సెప్టెంబర్, అక్టోబర్ 2026లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారత్‌లోనే తొలి రాజ్యాంగ మ్యూజియం, రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అకాడమీని సందర్శించాలని కూడా కేటీఆర్‌ను ఆహ్వానించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లోనూ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ విశేష గుర్తింపు సాధించింది. గతంలో రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, భారత ప్రధాన న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సహా పలువురు ప్రముఖులు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు