మెట్రోను అడ్డుకునే ఖర్మ కిషన్‌రెడ్డికి పట్టలేదు

– సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి ఆగ్రహం

కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 16: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మెట్రో విస్తరణను అడ్డుకోవాల్సిన ఖర్మ తమ పార్టీకి కానీ, తమ మంత్రులకు కానీ పట్టలేదన్నారు. మంగళవారం ఇక్క‌డ‌ మీడియాతో మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డికి లేదన్నారు. అర్థం లేని ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ సర్టిఫికెట్ తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. కావాలనే ఈ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి పదేపదే అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘సర’ విషయంలో కాంగ్రెస్ గందరగోళం చేస్తోందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ వాళ్లకు ఓటు ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఇతర దేశాల వారి ఓట్లను తొలగించాలని కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని కేంద్ర మంత్రి నిలదీశారు. మావోయిస్టులు చివరికి సాధించింది ఏంటని ప్రశ్నించారు. తుపాకీ గొట్టంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అభం శుభం తెలియని మైనర్లు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. తుపాకీ గొట్టం ద్వారా ఏవిÖ సాధించలేమని మావోయిస్టు అగ్ర నేతలు కూడా గుర్తించారని, కేంద్రానికి సహకరించి చాలామంది లొంగిపోయారని తెలిపారు. ఇదిలావుంటే కాంగ్రెస్.. ప్రత్యేకించి సీఎం రేవంత్‌రెడ్డి కొంతకాలంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. ప్రత్యేకంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విÖద విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఇక ఎంతమాత్రం ఉపేక్షించకూడదని బీజేపీ రివర్స్ అటాక్ మొదలు పెట్టిందని సమాచారం. ఇందులో భాగంగానే బండి సంజయ్ ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తన సహజ శైలికి భిన్నంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల విÖద ఘాటు విమర్శలు చేస్తున్నారంటే అది కచ్చితంగా పార్టీ వైఖరిలో మార్పేనని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విÖద కౌంటర్ ఎటాక్ చేయకపోతే పార్టీ కేడర్‌లోకి తప్ప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో ఉంది. అందుకే ముఖ్యమంత్రి విÖద డైరెక్ట్ అటాక్ మొదలెట్టినట్టు చెబుతున్నారు. ఆట నువ్వు మొదలు పెట్టావు.. 2028లో ఆ ఆటను మేము ముగిస్తాం.. నన్ను తెలంగాణ నుంచి తరిమికొట్టే వాడు ఇంకా పుట్టలేదు.. నేను చేతకాని రాహుల్ గాంధీ నాయకత్వం పనిచేయడం లేదు.. మా రాజీనామాలు సరే.. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేని విÖ సంగతి ఏంటంటూ గతంలో ఎన్నడూ లేనంత ఘాటుగా రేవంత్ విÖద కిషన్‌రెడ్డి మాటల దాడి చేశారు. కిషన్ రెడ్డిపై రేవంత్ వాడుతున్న భాష విషయంలో కూడా బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *