– సంతాపం ప్రకటించిన కేటీఆర్ , కవిత
రంగారెడ్డి,ప్రజాతంత్ర,నవంబర్3:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించాలని.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





