– మాజీ ఎమ్మెల్సీ, ఆర్‌ఎల్‌డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి
కల్వకుర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్సీ, ఆర్ ఎల్‌డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ ధ్యేయంగా దక్షిణ తెలంగాణ యాత్రలో భాగంగా ఆయన చేపట్టిన రథయాత్ర శనివారం కల్వకుర్తి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. అనంతరం చౌరస్తాలో రథంపై నుంచి ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలని, సామాజిక తెలంగాణ ధ్యేయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు న్యాయం జరగాలని, ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని కోరారు. రాబోయే కాలంలో బీఫాంలు అడిగే స్థితి నుండి బీఫాంలు ఇచ్చే స్థితికి రావాలన్నారు. ఆర్‌ఎల్డీ పార్టీ కచ్చితంగా సామాజిక న్యాయం పాటిస్తూ టికెట్లు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు రాజేందర్, కనుగుల జంగయ్య, సదానందం గౌడ్, గోపాల్, రమేష్‌బాబు, శ్రీనివాసులు, శేఖర్, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





