– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మన అందరి బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. డాక్టర్ కలాం జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ కలాం ఒక గొప్ప శాస్త్రవేత్తగా రక్షణ రంగంలో, అంతరిక్ష పరిశోధనల్లో, శాస్త్రీయ అభివృద్ధిలో దేశానికి మరుపురాని సేవలు చేశారని కొనియాడారు. ఈ దేశం ఆయనను ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఆ కృషిని గుర్తించి అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఆయనను దేశ రాష్ట్రపతిగా నియమించిందని ఆయన తెలిపారు. అనంతరం భారతరత్న అవార్డుతో సత్కరించిందన్నారు. ఒక సామాన్య వ్యక్తిగా, పుస్తకాలు రాసి, పిల్లలలో జ్ఞానాన్ని, దేశభక్తిని పెంపొందించేలా ప్రేరణనిచ్చారని అన్నారు. ఈ రోజు రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తుల విజయవం వెనుక కలాం ఆలోచనలే ఉన్నాయని గుర్తించాలన్నారు. అప్పట్లో లక్షల కోట్లు ఖర్చు చేసి ఇతర దేశాల నుండి ఆయుధాలు దిగుమతి చేసుకుంటే, ఈరోజు నరేంద్ర మోదీ పాలనలో భారత్ స్వయంగా రక్షణ ఉత్పత్తులు చేస్తోందని తెలిపారు. అంతేకాక మనం ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేయగలగుతున్న స్థితికి చేరుకున్నామన్నారు. ప్రతి కార్యకర్త కలాం చూపిన మార్గంలో ముందడుగు నడవాలని రామచందర్‌రావు ఉద్బోధించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





