9న మైనారిటీ యువత కోసం మెగా జాబ్ మేళా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జూన్ 9, 2026న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను మైనారిటీస్ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, గవర్నమెంట్ రిలేషన్స్ శాఖ మంత్రి జనాబ్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, కస్టమర్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన 40 నుండి 50 ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న మంత్రి అజారుద్దీన్ సంకల్పానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన మైనారిటీ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ మొహమ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ఉద్యోగార్థులను ప్రముఖ కంపెనీలతో అనుసంధానం చేసే ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *