– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ డాక్టర్ శోభా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వందలాదిమంది యువతకు ఉపాధి మార్గాలు దొరకడం సంతోషకరమన్నారు. బుధవారం జరిగిన జాబ్ మేళాలో ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఫార్మసీ, పారా మెడికల్ వంటి వివిధ రంగాల నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు నేరుగా ఇక్కడే ఆఫర్ లెటర్లు అందజేశారు. ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో వెతుక్కునే బదులు ఇటు యువతకు, అటు కంపెనీలకు ఒకే వేదికపై పరిష్కారం లభించింది. నేటి యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పబ్లిక్ సెక్టార్ మీదనే ఆధారపడకుండా తమ ప్రతిభతో స్టార్టప్‌ల ద్వారా ఉద్యోగ ప్రదాతలుగా మారాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి పథకాలతో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘ముద్రా యోజన’ ద్వారా మోదీ ప్రభుత్వం అపారమైన అవకాశాలు కల్పించిందని, ఉద్యోగాల కోసం వేచి చూసే స్థాయి నుంచి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి దేశ యువతను ఎదిగేలా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





