– కోట్లాది మందికి వ్యాధి వున్న విషయం తెలియదు
– ముందస్తు పరీక్షలతో వ్యాధిని నివారించవచ్చు
– రేపు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: ఎలాంటి లక్షణాలు లేకుండానే ఏళ్లతరబడి కాలేయాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీసే వైరల్ హెపటైటిస్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజారోగ్య సవాళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ ఏడాది “హెపటైటిస్: లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్” అనే అంశంతో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తం
హెపటైటిస్ ఒక ‘సైలెంట్ డిసీజ్
– సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. రఘురామ్ కొండాల
హెపటైటిస్ ఒక సైలెంట్ డిసీజ్. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే వైరస్ సంవత్సరాలపాటు కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. సిరోసిస్, లివర్ వైఫల్యం లేదా లివర్ క్యాన్సర్ వచ్చిన తర్వాతే చాలామంది మా వద్దకు వస్తుంటారు. కాలేయ సమస్యలన్నీ ఫ్యాటీ లివర్ లేదా మద్యం వల్లే వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ కూడా ప్రధాన కారణాలే. మధుమేహం, ఊబకాయం, గతంలో రక్తం ఎక్కించుకున్నవారు, డయాలసిస్ చేయించుకుంటున్నవారు, కుటుంబంలో కాలేయ వ్యాధుల చరిత్ర ఉన్నవారు, ఆరోగ్య సిబ్బంది, ఇతర ప్రమాద కారకాలు ఉన్నవారు లక్షణాలు లేకపోయినా హెపటైటిస్ పరీక్షలు చేయించుకోవాలి. హెపటైటిస్-ఏ, హెపటైటిస్-ఈ ప్రధానంగా కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా వ్యాపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వీటి కేసులు అధికంగా కనిపిస్తాయి. హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ మాత్రం కలుషిత రక్తం, సురక్షితం కాని ఇంజెక్షన్లు, శుభ్రత పాటించని వైద్య లేదా కాస్మెటిక్ విధానాలు, కలుషిత సూదులు పంచుకోవడం, రక్షణ లేని లైంగిక సంబంధాలు, తల్లి నుంచి శిశువుకు సంక్రమిస్తాయి. ఈ వైరస్‌లు ఏళ్ల తరబడి లక్షణాలు లేకుండానే శరీరంలో ఉండటంతో చాలామందికి వ్యాధి ఉన్న విషయం కూడా తెలియదు. తరచూ అలసటగా ఉండటం, నీరసం, ఆకలి లేకపోవడం, వాంతుల భావన, మూత్రం ముదురు రంగులో రావడం, కళ్లూ చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు), కారణం లేకుండా బరువు తగ్గడం, పొట్ట ఉబ్బడం, తరచూ జీర్ణ సమస్యలు రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రమాద కారకాలు ఉన్నవారు లక్షణాలు లేకపోయినా సాధారణ రక్తపరీక్షల ద్వారా హెపటైటిస్‌ను ముందుగానే గుర్తించవచ్చు.
ముందుగానే గుర్తిస్తే భయపడాల్సిన అవసరం లేదు.
– క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. ఆకాశ్ చౌధరి
హెపటైటిస్‌ను ముందుగానే గుర్తిస్తే భయపడాల్సిన అవసరం లేదు. హెపటైటిస్-బీని టీకాతో సమర్థంగా నివారించవచ్చు. హెపటైటిస్-సీని ఆధునిక యాంటీవైరల్ మందులతో చాలా మంది రోగుల్లో పూర్తిగా నయం చేయవచ్చు. అయితే అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ చాలామందిలో ఆలస్యంగా వ్యాధి నిర్ధారణ అవుతోంది. కాలేయం దెబ్బతినకముందే సాధారణ రక్తపరీక్షల ద్వారా వ్యాధిని గుర్తిస్తే సిరోసిస్, లివర్ క్యాన్సర్, లివర్ మార్పిడి అవసరమయ్యే పరిస్థితులను కూడా నివారించవచ్చు. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ను సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగం చేయాలి.హెపటైటిస్-బీ టీకాను ప్రతి ఒక్కరూ తీసుకోవడం, ముఖ్యంగా పుట్టిన వెంటనే శిశువులకు తొలి డోసు ఇవ్వడం, గర్భిణులకు హెపటైటిస్ పరీక్షలు నిర్వహించడం, సురక్షిత ఇంజెక్షన్ విధానాలు పాటించడం, రక్తాన్ని తప్పనిసరిగా పరీక్షించిన తర్వాతే వినియోగించడం, ఆస్పత్రుల్లో సంక్రమణ నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం అత్యంత అవసరం. రేజర్లు, టూత్ బ్రష్‌లు, సూదులు ఇతరులతో పంచుకోవద్దు. టాటూలు, పియర్సింగ్‌లు శుభ్రమైన పరికరాలతోనే చేయించుకోవాలి. పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్-ఏ, హెపటైటిస్-ఈ నుంచి కూడా రక్షణ పొందవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





