- సరస్వతి పుష్కర స్నానం అదృష్టంగా భావిస్తున్నా
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : కాళేశ్వరం సరస్వతీ పుష్కర ఏర్పాట్లు అద్భుతంగా, అనిర్వచనీయంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం కాలేశ్వరంలో కుటుంబ సమేతంగా డిప్యూటీ సీఎం పుష్కర పుణ్యస్నానం ఆచరించి, హారతి అనంతరం మీడియాతో మాట్లాడారు. పుష్కర స్నానంతో సకల సౌకర్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయని ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగి ఉంటే పుష్కర స్నానంతో అవి పరిసమాప్తం అవుతాయి అన్నారు. కుటుంబంతో కలిసి సరస్వతి పుష్కర స్నానం ఆచరించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.
12 రోజుల పాటు జరగనున్న పుష్కరాలకు ఏర్పాట్లు అద్భుతంగా చేశారు, వేలాదిగా జనం తరలి వస్తున్నారని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఎక్కడ చిన్న లోపం లేకుండా భక్తులందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని అన్నారు. వేలాది మంది వచ్చినా అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన టెంట్ సిటీ అద్భుతంగా ఉందని కొనియాడారు. భద్రత, పారిశుద్ధ్యం, స్నానాల గాట్ల వద్ద ఏర్పాట్లను అధికారులు నిబద్ధత, నిష్టతో ఏర్పాటు చేశారని వివ





