విద్య‌లో పెట్టుబ‌డి అంటే భ‌విష్య‌త్తును నిర్మించ‌డం

– ఐఏఎస్ ఆఫీస‌ర్ శంక‌రన్ సేవ‌లు అద్భుతం
– అధికారంలో వున్న‌వారు న్యాయం చేయాలి
– శంక‌ర‌న్ చూపిన మార్గం అనుస‌ర‌ణీయం
– మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌

హైదరాబాద్ (గౌలిదొడ్డి), ప్ర‌జాతంత్ర‌,  అక్టోబర్ 22: విద్యలో పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తును నిర్మించడం అని సీఎం రేవంత్ రెడ్డి  చెప్పిన మాటలను సాకారం చేస్తున్నారనీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఎస్‌.ఆర్‌. శంకరన్ జయంతి సందర్భంగా గౌలీదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలలో విద్యా ప్రాముఖ్యతపై స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెనపూడి గాంధీ , ప్రిన్సిపాల్ అంజన్న , కల్పన  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ప్రతీక – ఎస్‌.ఆర్‌. శంకరన్ అన్నారు. ఎస్‌.ఆర్‌. శంకరన్ దేశంలోని అత్యున్నత సేవా తపన కలిగిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు వర్గాల జీవితాలలో వెలుగు నింపేందుకు అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు.  “అధికారంలో ఉన్నవాడు దయ చూపడం కాదు, న్యాయం చేయాలి” అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారన్నారు.శంకరన్ చూపిన మార్గం ఈ రోజు రాష్ట్ర సంక్షేమ విధానాలకు దిశా నిర్దేశం చేస్తున్నది. ఆయన కలల తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి  సాకారం చేస్తున్నారు అన్నారు. “చదువు అన్నది గొప్ప ఆస్తి. ఎక్కడికి వెళ్లినా మీ చదువే మీ పరిచయం అని మంత్రి విద్యార్థులకు సూచించారు. యోగా, ధ్యానం ద్వారా ఏకాగ్రతను పెంపొందించుకోవాలని, క్రమశిక్షణను జీవిత భాగంగా చేసుకోవాలని, గురువులు, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. మీ సమస్యల పరిష్కారం కోసం నేను కట్టుబడి ఉన్నాను అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అరికెనపూడి గాంధీ మాట్లాడుతూ గౌలిదొడ్డి అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి గారి కృషితో వేగంగా కొనసాగుతోంది అని  అన్నారు. గౌలిదొడ్డి డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి రూ.1.5 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశాం. విద్యార్థుల కోసం మౌలిక వసతులు మరింతగా బలోపేతం చేస్తాం అని అన్నారు. ఇక్కడి విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్రం, దేశం గర్వించేటట్లు ఎదగాలని నా ఆకాంక్ష అని పేర్కొన్నారు.  ప్రిన్సిపాల్ అంజయ్య, కల్పన మాట్లాడుతూ గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. మంత్రి, ఎమ్మెల్యేల సహకారంతో విద్యార్థుల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుంది అని ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page