– వొచ్చే ఏడాది నుంచే అమల్లోకి కొత్త సిలబస్
- ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. 2026 ఫిబ్రవరి 25 వ తేదీ నుంచి మార్చి 18 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన మీడియాకు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయని, ఇంగ్లీష్‌లో ఉన్నట్లుగానే మిగతా భాషల్లోనూ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 12 ఏళ్ల తర్వాత ఇంటర్ సిలబస్‌లో మార్పులు జరగబోతున్నట్లు తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్టీ, బోటనీ, జువాలజీ సిలబస్ మారబోతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యా విధానంలో మార్పులతోపాటు పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్ , ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్ సిలబస్ లోనూ మార్పులు చేసినట్లు ప్రకటించారు. 12 సంవత్సరాల తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్టీ, బొటనీ, జువాలాజీలో సిలబస్ లో మార్పులు జరిగాయని ప్రకటించారు. హ్యుమానిటీస్ స్జబెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్ ఏప్రిల్ మొదటి వారంలో బుక్స్ అందుబాటులోకి వొస్తాయని ఆయన వెల్లడించారు. అలాగే కొత్త కోర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ లో ఉన్నట్టుగానే మిగతా లాంగ్వేజెస్ లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇకపై 80 మార్కులు ఎక్స్‌టర్నల్, 20 మార్కులు ఇంటర్నల్ ఉంటాయన్నారు. ల్యాబ్ ప్రాక్టికల్స్ ప్రతి సంవత్సరం 15 మార్కుల చొప్పున నిర్వహించనున్నారు. అంతేకాక ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు కృష్ణ ఆదిత్య తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





