– అమెజాన్, ప్లిప్‌కార్ట్, విూషో సహా పలు సంస్థలకు షాక్
– ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై రూ.44లక్షల వరకు జరిమానా
న్యూదిల్లీ, జనవరి 16: చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్న పలు ఈ`కామర్స్ సంస్థలపై కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) సుమోటోగా చర్యలు చేపట్టింది. అమెజాన్, ప్లిప్‌కార్ట్, విూషో సహా పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై మొత్తంగా రూ.44లక్షల వరకు జరిమానా విధించింది. వినియోగదారుల రక్షణ, టెలికాం చట్టాలను ఉల్లంఘించి పలు ఈ`కామర్స్ సంస్థలు నిబంధనలకనుగుణంగా లేని ఉత్పత్తులను లిస్ట్ చేసి విక్రయిస్తున్నట్లు సీసీపీఏ గుర్తించింది. సాధారణంగా 446.0`446.2 బ్యాండ్‌లోని పర్సనల్ మొబైల్ రేడియోలకు మాత్రమే లైసెన్స్ మినహాయింపు వర్తిస్తుంది. మిగతా వాటి దిగుమతి, విక్రయాల కోసం తప్పనిసరిగా ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాక లైసెన్సింగ్ నిబంధనలకు సంబంధించిన వివరాలను కూడా విక్రయదారులు స్పష్టంగా తెలియజేయాలి. అయితే ప్లిప్‌కార్ట్, అమెజాన్, విూషో, జియో మార్ట్ తదితర ఈ`కామర్స్ సంస్థలు ఈ నిబంధనలను ఉల్లంఘించి లైసెన్స్ మినహాయింపు ఫ్రీక్వెన్సీ రేంజ్ దాటి ఉన్న వాకీ టాకీలను విక్రయించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇందుకుగాను విూషో, మెటా, ప్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలకు రూ.10లక్షల చొప్పున జరిమానా విధించింది. చిమియా, జియో మార్ట్, టాక్ ప్రో, మాస్క్‌మ్యాన్ టాయ్స్ సంస్థలకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. వీటిలో విూషో, మెటా, చిమియా, జియో మార్ట్, టాక్ ప్రో ఇప్పటికే పెనాల్టీలు చెల్లించినట్లు సీసీపీఏ వెల్లడిం చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





