తవ్వకాల్లో బయటపడ్డ అమ్మవారి విగ్రహం

– ప్రత్యేక పూజలకు భారీగా తరలి వ‌చ్చిన‌ జనం 

మంచిర్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ‌మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా నేలమాలిగ గ్రామానికి వొచ్చిన స్వాజీలు చెప్పిన మాట మేరకు సోమవారం తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం కనిపించింది. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన ఈ తవ్వకాలను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. తవ్వకాలు జరుపుతున్న సమయంలో కొంతమంది భక్తులు పూనకాలతో ఊగిపోయారు. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లాకు అయోధ్యలోని శ్రీరామమందిరంలోని పూజారితో పాటు వారణాసి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీఠాధిపతులు, పలువురు స్వాములు వచ్చారు. ఈ సందర్భంగా ముల్కల మండలం నేలమాలిగలోని గోదావరి తీరంలో పుష్కరఘాట్‌కు వెళ్లే మార్గంలోని ఓ ప్రదేశాన్ని చూపించి, అక్కడ ఏదో తెలియని శక్తి ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్‌‌డియాలో వైరల్‌గా మారాయి. దీంతో స్థల యజమాని అనుమతి తీసుకున్న స్థానికులు, ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో సింహంపై కూర్చున్న దుర్గామాత విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలిసి మంచిర్యాల పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి, అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామీజీ చెప్పినట్లుగా అక్కడ దుర్గామాత విగ్రహం బయటపడటంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ గ్రామం చేసుకున్న అదృష్టమని చెబుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page