రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు

సింగపూర్‌లో బిజీగా సిఎం రేవంత్‌
‌మంత్రి గ్రేస్‌ ‌ఫు హైయిన్‌తో భేటీ
తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్‌ ‌ప్రతినిధి బృందం సింగపూర్‌ ‌వాణిజ్య, పర్యావరణ మంత్రి  గ్రేస్‌ ‌ఫు హైయిన్‌తో భేటీ అయింది. తెలంగాణతో వివిధ రంగాలలో సింగపూర్‌ ‌ప్రభుత్వ భాగస్వామ్యంపై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ ‌బాబు, ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వివరించారు.  ప్రధానంగా నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, స్పోర్టస్, ‌సె కండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉన్న అనుకూలతలను వివరించారు.

తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు సింగపూర్‌ ‌మంత్రి గ్రేస్‌ ‌పు హైయిన్‌ ‌సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైజింగ్‌ ‌లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని హా ఇచ్చారు. ప్రధానంగా ఫ్యూచర్‌ ‌సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, ‌నీటి వనరుల నిర్వహణ, తెలంగాణ ఎంచుకున్న సుస్థిర వృద్ధి  ప్రణాళికలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శించారు.  పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలిసి పని చేసేందుకు అంగీకరించారు. ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై  అధ్యయనం చేసేందుకు  ప్రత్యేక బృందాలను గుర్తించాలని నిర్ణయించారు. వివిధ రంగాల్లో సింగపూర్‌ అనుభవాలను పంచుకోవాలని, దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణలో సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టుల కార్యాచరణ వేగవంతం చేయాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page