అన్ని పంట‌లు పండిస్తేనే అధిక ఆదాయం

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు

హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే అన్ని పంటలు పండించాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Minister Thummala Nageshwar rao) అన్నారు. హుస్నాబాద్‌లో శుక్ర‌వారం మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు రైతు మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ మన తాతలు రెండు కిలోల యూరియా వాడితే మనం 150 కిలోల యూరియా వాడుతున్నాం.మన పంటలు ఇతర దేశాలు కొనాలంటే వారు టెస్ట్ చేసినప్పుడు అది పనికి వచ్చేలా ఉండాల‌న్నారు,  ప్రకృతి సిద్ధంగా సేంద్రీయ ఎరువులతో పంటలు పండించిన‌ప్పుడే మన ధాన్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నారు.

వ్యవసాయ యూనివర్సిటీ వీసీ కు ,ఫ్రొఫెసర్లు , శాస్త్రవేత్తలు, అనుభవం ఉన్న రైతుల ద్వారా మీరు నేర్చుకోండి. మన భూమికి ఏ పంట అవసరం. ఏ పంట వేస్తే ఆదాయం అధికంగా వస్తుంద‌ని చూసిన తర్వాత పంటలు వేయాల‌ని సూచించారు. మనం ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. మనం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు కూరగాయలు పంపించే స్థాయికి ఎద‌గాల‌న్నారు. రూ. 35 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామ‌న్నారు.ఈ సంవత్సరం రైతు భరోసా రైతులు పంటలు వేయకముందే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి రైతాంగానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంద‌ని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ లో గోదాములు ఏర్పాటు చేస్తాం. హుస్నాబాద్ కి దగ్గరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉంది. వచ్చే నెలలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామ‌న్నారు. ఆయిల్ ఫామ్ ద్వారా మూడవ సంవత్సరం నుండే ఆదాయం వస్తుంది. అంతర పంటలు ద్వారా ఆదాయం వస్తుంది.. హార్టికల్చర్ నుండి కూడా పైసలు వస్తున్నాయి. కేంద్రం పూర్తిస్థాయిలో ఎరువులు సప్లై రావడం లేదు.. ఎరువులు యూరియా ముందే బఫర్ స్టాక్ పెట్టుకున్నామ‌న్నారు.  విత్తనాలకు కొరత లేదు. నష్టం వస్తున్నా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  సన్ ఫ్లవర్,జొన్నలు ,మక్కలు, పెసలు కూడా కొనుగోలు చేశామ‌న్నారు. దీనిపై కూడా రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదని హిత‌వు ప‌లికారు. ప్రభుత్వం ,ప్రతిపక్షాలు రాజకీయాలకు అతీతంగా రైతులను ఆత్మీయంగా చూడాలి.  మీరు ప్రకటించిన మద్దతు ధరకు రైతుల దగ్గర నుండి ధాన్యం కొనాలని కేంద్రం కొనాలని డిమాండ్  చేస్తున్నామ‌న్నారు. పాడి పరిశ్రమ , ఆవులు ,గేదెలు ,చేపలు వ్యవసాయ అనుబంధ రంగాల పెంచాలి. మునగ ద్వారా మంచి ఆదాయం వస్తుంది. హుస్నాబాద్ రాబోయే రోజుల్లో పచ్చని పాడి పంటలతో సశ్యశ్యామలంగా ఉండాల‌ని ఆకాంక్షించారు. రైతు మహోత్సవం లో మూడు రోజుల పాటు అన్ని అంశాల పై అవగాహన కల్పించాల‌ని అధికార్ల‌ను కోరారు.

ఆధునిక యంత్రాల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న‌:  పొన్నం

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక యంత్రాలపై , కిసాన్ మేళాలో రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.  సిద్దిపేట ,కరీంనగర్ ,హనుమకొండ ,వరంగల్ జిల్లా రైతులు పాల్గొని అవకాశాన్ని ఉపయోగించుకోవాల‌ని కోరారు. ఎన్ని పనులు ఉన్నా రైతు మహోత్సవాన్ని ఉపయోగించుకొని హార్టికల్చర్ , సేరికల్చర్ తదితర వాటిపై అవగాహన కల్పించూసుకోవాల‌న్నారు. అడగగానే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ప్రాంత రైతులు చైతన్యం అయి మరింత ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంద‌న్నారు. విద్యాలయాలసంఖ్య‌ను పెంచ‌డం  ,ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి కృషి చేయడం ,కొండలు ,గుట్టలతో ఉన్న ఇక్కడ టూరిజం అభివృద్ధి చేయడం ,ఈ ప్రాంతం 90 శాతం పాడి పశువులతో ఉన్న ఇక్కడ మరింత అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామ‌న్నారు. గ్రామీ ణ ప్రాంతాలుగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని మరింత ఆదర్శవంతంగా చేస్తామ‌న్నారు. మూడు రోజులు జరిగే ఈ రైతు మహోత్సవం ఉపయోగించుకోవాలి.హుస్నాబాద్ రైతాంగం ఎక్కడికి వెళ్లిన చెప్పేలా తెలంగాణ రైతాంగానికి మార్గదర్శకత్వం కావాల‌న్నారు.రైతులకు అవగాహన కలిగేలా వచ్చే మూడు రోజులు కార్యక్రమాలు ఉండాన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ వారు ఓపిగ్గా మా రైతుల‌కు అవ‌గాహ‌న క‌లిగించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి,వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్,సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ,మార్కెట్ కమిటీ చైర్మన్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page