- – ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం
- – వాతావరణశాఖ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, 36 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మరో ఐదు రోజుల పాటు కూడా ఈదురుగాలులతో కూడా వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలో టర్ల వేగంతో పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. పశ్చిమ, తూర్పు జిలాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపారు. అటు తెలంగాణలోనూ పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌బాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వర్షాలు కురవనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కర్నాటక-గోవా తీరాల వెంబడి తూర్పు మధ్య అరేబియా సముద్రంపైనున్న ఉపరితల ఆవర్తం నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి సగటు సముద్రమట్టానికి 3.1 కిలోటర్ల వరకు విస్తరించి ఉందని.. ఆంధప్రదేశ్ మధ్య ప్రాంతాలు, పరిసరాలను ఆనుకొని ఉన్న దక్షిణ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోటర్ల విస్తరించి ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
ఈ క్రమంలో నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో గంటకు 30-40 కిలోటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది.
గురువారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలుపడుతాయని తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే, శుక్ర, శని, ఆదివారాల్లోనూ హైదరాబాద్ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణశాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.