హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగించింది. వరంగల్ కోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది రమణారావు కోర్టుకు వివరించారు. సుబేదారీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ నెల 16న కౌశిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 17న విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆ లోపే 21న కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. వరంగల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం రిమాండ్‌ను తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ముగించింది.
—–
కౌశిక్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ
