చేప‌లు తింటే ఆరోగ్య‌ లాభాలు ఎన్నో

– అధికారులు ప్ర‌చారం చేయాలి
– చేప‌ల ఉత్ప‌త్తి పెంచాలి
– మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: చేపలు తిన‌డం వల్ల జరిగే ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచార ప్రణాళికలు రూపొందించాల‌ని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి  అన్నారు.సోమవారం నాడు డా బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై 32 జిల్లాల కలెక్టర్లు,మత్స్య శాఖ అధికారులతో మ ఆయ‌న  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నవంబర్ చివరికల్లా చేప పిల్లల పంపిణీ పూర్తి కావాలి. అందుకనుగుణంగా ప్రజాప్రతినిధులను కలుపుకొని పంపిణీ చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మత్స్యశాఖపై ఉన్న అభియోగాన్ని మార్చేందుకు ప్రతి చెరువు వద్ద చేపపిల్లల పంపిణీ వివరాలు తెలిసేలా సైన్ బోర్డు ఏర్పాటు చేయాలి.. చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం నియమ నిబంధనలు అనుగుణంగా టి మత్స్య యాప్ లో అప్లోడ్ చేయాల‌న్నారు. కృష్ణా,గోదావరి జీవనదులు, గొలుసు కట్టు చెరువులు ఉన్న ప్రాంతం మనది.. చేపల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాల‌న్నారు. ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ సదుపాయం పెంచాలి.ప్రతి నియోజకవర్గంలో ఫిష్ రిటైల్ అవుట్ లెట్ మార్కెట్ కోసం ప్రభుత్వ స్థలాలను కలెక్టర్లు కేటాయించాలి.మాంసం భుజించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ చేపలను భుజిచడంలో వెనుకబడి ఉంది.చేపల భుజించడం వల్ల జరిగే ఆరోగ్యపరమైన లాభాలపై విస్తృత ప్రచార ప్రణాళికలు రూపొందించాల‌న్నారు. వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల వంటకం అమలును పరిశీలిస్తున్నాం.  తెలంగాణ రాష్ట్రంలో అమలుపై సిఎం రేవంత్ రెడ్డితో చ‌ర్చిస్తామ‌న్నారు. చేప పిల్లల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మరియు ప్రతి వారం ఇందుకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఈ సమావేశంలో పాల్గొన్న మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్,ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల,అడిషనల్ డెరైక్టర్ శ్రీనివాస్,తదితర అధికారులు పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page