– టిమ్స్ సందర్శనకు బీఆర్ఎస్ పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని బుధవారం హౌస్ అరెస్టు చేశారు. కోకాపేట్‌లోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించి నగరం నలువైపులా ’టిమ్స’ పేరుతో సూపర్‌స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయానికి నిర్మాణ పనులు 60 శాతానికిపైగా పూర్తయ్యాయి. గత ఏడాదే మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి రావాల్సి ఉండగా ప్రస్తుతం సనత్‌నగర్ టిమ్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ నేపథ్యంలో నత్‌నగర్ టిమ్స్‌ను సందర్శించేందుకు హరీష్‌రావు పిలుపునివ్వగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనను హౌస్ అరెస్టు చేశారు. అలాగే మరో మాజీ మంత్రి తలసానిని కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. టిమ్స్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు టిమ్స్‌ను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమను హౌస్ అరెస్టులు, అక్రమ నిర్బందాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. సనత్ నగర్, అమీర్‌పేట డివిజన్‌ల ముఖ్య నాయకులను పోలీసులు ఎందుకు హౌస్ అరెస్టు చేశారని తలసాని ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




