హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ఇంట రాఖీ పండగ సంబరాలు ఘనంగా జరిగాయి. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా హరీశ్ రావుకు మహిళా ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్‌రావు వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. తనకు రాఖీలు కట్టిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని హరీశ్ రావు అన్నారు. ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తనపై చూపిన ఆప్యాయతకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




