– సంస్కృతి, పదాయాలు ప్రతిబింబించేలా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్
– కళాకారులకు రాష్ట్రస్థాయి అవార్డులతో సన్మానం
– గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్‌లు నిలుస్తాయని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ హస్తకళల అబివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న హస్త కళలను పరిరక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం హస్త కళాకారులకు ఉపాధి దొరికేలా అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఎంతో ప్రత్యేకమైన హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్‌లను, చేనేత ఉత్పత్తులను పుణ్యక్షేత్రాలు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్ల వంటి ముఖ్యమైన ప్రాంతాలలో ఏర్పాటు చేసి ప్రమోట్ చేయాలని మంత్రి తుమ్మల సూచించారు కాగా, ఈ ఎగ్జిబిషన్‌లో పలు రాష్ట్రాల నుంచి సుమారు 150 హస్త కళల, చేనేత ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది హస్త కళాకారులకు రాష్ట్రస్థాయి అవార్డులతో మంత్రి తుమ్మల సన్మానించారు. కార్యక్రమంలో హస్తకళల అబివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, అసిస్టెంట్ డైరెక్టర్ సువార్చల రాణి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





