విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకుంటాం

– ప్రమాద బాధితులతో సీఎం ను కలుస్తా
– పరిహారం చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే

వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5: ‌బస్సు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకుంటామని  ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్‌ ‌రెడ్డి హా ఇచ్చారు. త్వరలోనే బాధితులతో సిఎం రేవంత్‌ను కలిసి చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.42 లక్షలు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్‌ ‌రెడ్డి, తాండూరు సబ్‌ ‌కలెక్టర్‌ ఉమాశంకర్‌ ‌ప్రసాద్‌ ‌వారి గ్రామాలకు వెళ్లి ఆర్థిక సహాయం అందజేశారు. చేవెళ్ల మండలం ర్జాపూర్‌ ‌వద్ద  జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే చెక్కులను అందించారు. యాలాల మండలం హాజీపూర్‌ ‌గ్రామానికి చెందిన కురుగుంట లక్ష్మి, బందెప్ప దంపతులు, లక్ష్మీనారాయణ పురం గ్రామానికి చెందిన విద్యార్థిని అఖిలారెడ్డి, పేర్‌ ‌కంపల్లి గ్రామానికి చెందిన సాయి ప్రియ, నందిని, తనూష ప్రమాదంలో మరణించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హాజీపూర్‌ ‌గ్రామానికి చెందిన కురుగుంట బందప్ప, లక్ష్మి దంపతులు అక్కడికక్కడే మరణించారు. వాళ్ల పిల్లలు శివలీల, భవానీ అనాథలు కావడంతో వారికి తన సొంత డబ్బులతో ఇల్లు కట్టిస్తానని, వారి పూర్తి బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. త్వరలోనే వారిని సీఎం రేవంత్‌ ‌రెడ్డి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారు. లక్ష్మీనారాయణపూర్‌, ‌పేరుకంపల్లిలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆర్థిక సహాయం చేయడంతో పాటు, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హా ఇచ్చారు.  కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌సుధీర్‌, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీ‌లత ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page