వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.12.99 కోట్ల తక్షణ సాయం

– నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: మొంథా తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.15 వేల చొప్పున సాయం అందిస్తూ రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా కలెక్టర్లు పంపించిన నివేదికల ప్రకారం 15 జిల్లాల్లో 8,662 ఇండ్లు దెబ్బతిన్నాయి. వీరికి తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అక్టోబర్‌ 27 నుంచి 30 వరకు వరుసగా నాలుగు రోజులు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, వనపర్తి, రంగారెడ్డి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్‌, సూర్యాపేట, భద్రాద్రి కోతగూడెం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page