శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

– 1.8 కిలోలు.. విలువ రూ.2.37 కోట్లు

హైదరాబాద్‌: శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుండి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ రూ.2.37 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌ అరేబియా విమానం జి`49467 ద్వారా కువైట్‌ నుండి షార్జా మీదుగా శంషాబాద్‌కు పయాణించిన ఒక ప్రయాణికుడిని అడ్డుకున్నారు. అతని చెక్‌-ఇన్‌ బ్యాగేజీని క్షుణ్ణంగా పరిశీలించి అందులోని రూ.2.37 కోట్ల విలువైన 1798 గ్రాముల ఐదు 24 క్యారట్ల బంగారు కడ్డీలు, రెండు 24 క్యారట్ల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఐదు బంగారు కడ్డీలను డోర్‌ మెటాలిక్‌ లాక్‌లో దేశీయంగా దాచిపెట్టగా, రెండు బంగారు కడ్డీ ముక్కలను పొద్దుతిరుగుడు విత్తనాలు ఉన్న ప్లాస్టిక్‌ పౌచ్‌లో దాచిపెట్టినట్లు డీఆర్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ప్యాకింగ్‌ మెటీరియల్‌తోపాటు విదేశీ మూలానికి చెందిన అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడిని కస్టమ్స్‌ చట్టం-1962 నిబంధనల కింద అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page