– రూ.1140 మేర తగ్గుదల నమోదు
హైదరాబాద్, అక్టోబర్ 27: ఊహించినట్టుగానే సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం ధరలు మరింతగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లలో పసిడి ధరల తగ్గుదల, అమెరికా`చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, డాలర్ బలపడుతుండటం వెరసి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడిరగ్ మొదట్లో పసిడి ధరలు తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర గతంతో పోలిస్తే రూ.1140 మేర తగ్గి రూ.1,24,480కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1050 మేర తగ్గి రూ.1,14,100 వద్ద తచ్చాడుతోంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పసిడి ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఔన్స్ బంగారం (24 క్యారెట్) స్పాట్ ధర రూ.0.7 శాతం మేర క్షీణించి 4,082.77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 1 శాతం మేర తగ్గి 4,095.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నేటి ట్రేడిరగ్ ముగిసే సమయానికి ధరలు మరింత తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాల అంచనా. అమెరికా, చైనా మధ్య సానుకూల వాతావరణంలో వాణిజ్య చర్చలు జరుగుతుండటంతో సురక్షిత పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండికి డిమాండ్ తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రామాణిక వడ్డీ రేట్ల కోత విషయంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తీసుకునే నిర్ణయం గురించి మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించడంతో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లల్లో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించే అవకాశం ఉంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ జపాన్ మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





