– రూ.లక్షన్నరకు చేరువగా పరుగులు
హైదరాబాద్, అక్టోబర్ 7: పసిడి ధర పరుగులు ఆగడం లేదు. రోజురోజుకు పెరుగుతూ రూ.లక్షన్నరకు చేరువగా పరుగులు తీస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,850కి చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,11,500గా ఉంది. వెండి కిలో రూ.1,54,350కి చేరింది. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,460 ఉండగా మంగళవారం మరో రూ.390 పెరిగింది. కిలో వెండి ధర రూ.1,54,200 ఉండగా తాజాగా మరో రూ.150 పెరిగి రూ.1,54,350కి చేరింది. అమెరికా షట్‌డౌన్ కొనసాగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఈ ఏడాదిలో మరింత తగ్గిస్తుందనే అంచనాల నేపథ్యంలో మదుపుదారులు తమ నిధులను బంగారం, వెండిపైకి మళ్లించడం ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పండగల సీజన్ కావడం, అంతర్జాతీయంగా మార్కెట్ల అస్థిరత, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి పతనం బంగారం ధర పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. మరోవైపు వెండి కూడా కిలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని ఇటీవల మార్కెట్ పండితులు అంచనా వేసిన సంగతి తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





