- భారీగా తరలివచ్చిన విప్లవ, ప్రజా సంఘాల నాయకులు
- గణేష్ నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 20: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా రంపచోడవరం ఎన్కౌంటర్ లో అశువులు బాసిన mavo గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ పార్థివదేహం శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల కు తీసుకువచ్చారు.
వెలిశాల గ్రామంలో ఉదయం నుంచి ప్రజలు అశ్రునివాలుల అర్పిస్తున్నారు. అదేవిధంగా విప్లవ ప్రజా సంఘాల నాయకులు విరసం ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ కమిటీ సభ్యులు భారీగా తరలివచ్చి రవికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే….
గాజర్ల రవి ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన వెలశాలకు తీసుకురావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు.
జనసంద్రంగా మారిన వెలిశాల …
ఎన్కౌంటర్లో మృతి చెందిన గాజర్ల రవి మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులతో పాటు విప్లవ సంఘాలు, ప్రజాసంఘాలు , ప్రజా ఉద్యమాలలో అనుబంధం ఉన్న వారందరూ వెలిశాలకు చేరుకొని గణేష్ కు కడసారి నివాళులర్పించేందుకు భారీగా తరలివచ్చారు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి….
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన గాజుల రవి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామంలో స్మశాన వాటికలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం వరకు గాజర్ల రవి పార్థివ దేహానికి అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తి కానుంది.