– బాధితులకు పరామర్శ
– సహాయసహకారాలందించేందుకు తక్షణ చర్యలు
గద్వాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్నటేకూరులో బస్సు ప్రమాద స్థలానికి జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావులు హుటాహుటిన వెళ్లారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి సంబంధిత అధికారులతో చర్చించి సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయసహకారాలు అందించేందుకు కర్నూలు జిల్లా యంత్రాంగంతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తోంది. ప్రయాణికుల కుటుంబ సభ్యులకు అవసరమైన సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కింది అధికారులతో హెల్ప్‌లైన్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేసింది. శ్రీరామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ: 9912919545,
చిట్టిబాబు, సెక్షన్ ఆఫీసర్: 9440854433.
అలాగే జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, పోలీసు కంట్రోల్ రూమ్ నందు హెల్‌లైన్ ఏర్పాటు చేశారు. సమాచార కోసం బాధిత కుటుంబాలు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు.
గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828
గద్వాల్ కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నం.9502271122,
కలెక్టరేట్‌లోని హెల్ప్ డెస్క్ నం.9100901599, 9100901598,
కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కంట్రోల్ రూమ్ నం.9100901604
గవర్నర్ జిష్ణుదేవ్ విచారం
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ దారుణ ఘటన మన రహదారులపై భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని, ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





