శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, జూన్ 14: పోటీ ప్రపంచంలో విజయాలు సాధించాలంటే నేటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో అవసరమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఎంపి రఘునందన్ రావు, ఎమ్మెల్సీ దయానందన్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బి జేపి మహేశ్వరం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్, దేప భాస్కర్ రెడ్డి, తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో శ్లోక విద్యా సంస్థలు చైర్మన్ బిట్ల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ చింతల సంగమేశ్వర్ గుప్త, డైరెక్టర్ తేలుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.