సంస్క‌ర‌ణ‌ల‌తో ముందుకెళ్లాలి

– సీఎం రేవంత్‌తో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ భేటీ

జూబ్లీహిల్స్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్బీఐ బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా  క‌లిసారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను ఆర్బీఐగవర్నర్ కు సీఎం వివరించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు, సోలార్ విద్యుత్ వినియోగం పెంచే దిశగా చేప‌ట్టిన చ‌ర్య‌ల వివ‌రాలు ఆర్బీఐ గ‌వర్న‌ర్‌కు వివ‌రించారు. కాగా బ‌డ్స్  యాక్ట్ ను నోటిఫై చేయాలని ముఖ్యమంత్రిని  ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కోరారు.  మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేజ్ (యూఎల్ ఐ) విషయం ఆర్బీఐ  తీసుకుంటున్న చొరవను సిఎం కు ఆయ‌న  వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్స్ క్లెయిమ్ క్యాంపెయినింగ్ పై సిఎం కు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్బీఐ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ చిన్మోయ్ కుమార్, జనరల్ మేనేజర్స్ మేజర్ యశ్పాల్ చరణ్, ఎస్‌. పాణిగ్రాహి, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page