రాజకీయ మనుగడ కోసం జలవివాదం

– వరుస ఎన్నికల్లో ఓటమితో తెరపైకి నీటి పంచాయితీ
– ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు
– బీఆర్‌ఎస్‌ ‌హయాంలో నీటి వాటాలు వదులుకున్నారు
– కేసీఆర్‌, ‌హరీష్‌ ‌రావుల సంతకాలు బయటపెడతా
– కేసీఆర్‌ ‌నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతారు
– తెలంగాణ వాటాను మనం వాడుకోలేని దుస్థితికి తెచ్చారు
– అసెంబ్లీలో ఆరోగ్యకరమైన చర్చకు రావాలి
-’నీళ్లు-నిజాలు’ అంశంపై  పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌
– మీ‌డియాతో సిఎం రేవంత్‌ ‌కీలక అంశాలు వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి1: పాలమూరు సహా అనేక విషయాల్లో గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు జలదోపిడీ అంటూ ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ అం‌డ్‌ ‌కో తమ ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లే ప్రధాన కారణమని తెలిపారు.నీటి వాటాలపై చర్చ దృష్ట్యా ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం ‘నీళ్లు-నిజాలు’ అంశంపై ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలది సంకుచిత స్వభావమని విమర్శించారు. కేసీఆర్‌ ‌నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ‌హయాంలోని పదేళ్లలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నదీ జలాల అంశాలను పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ ‌ద్వారా మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వివరించారు. ఈ ప్రజంటేషన్‌కు హాజరై ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తెస్తున్నామని చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్‌, ‌హరీశ్‌రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నీటి చౌర్యం చేస్తున్న.. తెలంగాణ వాటాను మనం వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ఆ ప్రాజెక్టును మార్చారని మండిపడ్డారు. తల వదిలేసి తోక దగ్గర నీళ్లు తెచ్చేలా ప్రాజెక్టు డిజైన్‌ ‌చేశారని విమర్శించారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల ఒప్పందాన్ని కేసీఆర్‌ ‌చేశారని ఆరోపణలు చేశారు. ఏపీకి 66శాతం నీళ్లు శాశ్వత హక్కు వచ్చేలా కేసీఆర్‌ ‌సంతకం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ నీటి లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి  పేర్కొన్నారు. తెలుగు రాష్టాల్ర మధ్య జలవివాదం సృష్టించి.. తద్వారా లబ్ది పొందాలని భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఆరోపించారు.  ప్రధానంగా నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచి ఉండేది. నీళ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పీజేఆర్‌ ‌స్వంత ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో నీళ్ల విషయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అని చెప్పారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్‌ ‌సంతకం చేశారు. కేసీఆర్‌ ‌పెట్టిన సంతకం ఏపీకి అడ్వాంటేజ్‌గా మారింది. అప్పుడు ఏపీకి 66శాతం, తెలంగాణకు 34 శాతం జలాలకు ఆయన అంగీకరించారు. తదుపరి బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రైబ్యునల్‌ ‌తీర్పు రాకుండా వాయిదా వేయిస్తున్నారు. నదీపరివాహకం ప్రకారం చూస్తే.. కృష్ణా జలాల్లో తెలంగాణకు 71శాతం రావాలి. నదీ పరివాహకం ప్రకారం జలాలు కావాలని వాదించాల్సి ఉండగా.. కేసీఆర్‌ అలా అడగలేదు. కృష్ణాలో 299 టీఎంసీలకు కేసీఆర్‌ అం‌గీకరించారని ఇవాళ కేఆర్‌ఎం‌బీ అంటోంది.  బీఆర్‌ఎస్‌ ‌మనుగడ కష్టమని కేసీఆర్‌ ‌గుర్తించారు.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పరాజయం పాలైంది. ఎన్నికల్లో వరుస ఓటములతో భారత రాష్ట్ర సమితి మనుగడ కష్టమవుతోందని  కేసీఆర్‌ ‌గుర్తించారు. మళ్లీ జలవివాదం రేపి, ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల సృష్టించి తన పార్టీని బ్రతికించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక అబద్దాల సంఘాన్ని ఏర్పాటుచేసుకొని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని బతికించుకునేందుకు మళ్లీ నీళ్ల సెంటి మెంట్‌ను వాడుకుంటున్నారు. చంద్రబాబు పేరు చెప్పి తెలంగాణలో మళ్లీ పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు‘ అని సీఎం విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్‌ ఏడేళ్ల వరకు డీపీఆర్‌ ‌సమర్పించలేదు. డీపీఆర్‌ ‌రూపొందించకుండానే రూ.27వేల కోట్లు ఖర్చు చేశారు. డీపీఆర్‌ ‌రూపొందించలేదు కాబట్టి.. పర్యావరణ అనుమతులు కూడా రాలేదు. అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేశారు. సుప్రీంకోర్టులో కేసులు వేయడంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు కాదని అఫిడవిట్‌ ‌వేశారు. తాగునీటి కోసం 7.15 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తున్నామని కోర్టుకు చెప్పారు. కమీషన్ల కోసం పంపులు, లిఫ్టుల కంపెనీలకు రూ.27వేల కోట్లు చెల్లింపులు చేశారు. ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా అయితేనే కషన్లు భారీగా వస్తాయని కేసీఆర్‌ ‌కుట్ర చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి నీటిని తీసుకునేలా రూపొందించారు. జూరాల నుంచి అయితేనే లిప్ట్‌లు ఎక్కువ పెట్టలేమని భావించిన కేసీఆర్‌ ‌దాన్ని శ్రీశైలానికి మార్చారు.  తల దగ్గర నుంచి నీరు తీసుకునేది వదిలేసి తోక దగ్గర నీళ్లు తీసుకునేలా డిజైన్‌ ‌చేశారు. శ్రీశైలం బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుంచి 0.25 టీఎంసీలు మాత్రమే తీసుకునే దుస్థితి ఏర్పడింది. ఏపీ ప్రభుత్వం మాత్రం రోజుకు 13 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నది. ఏపీలో పనిచేసిన ఆదిత్యనాథ్‌ ‌దాస్‌ను సలహదారుగా నియమించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆయనకు తెలంగాణలోని ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులపై పూర్తి అవగాహన ఉన్నది. కేసీఆర్‌కు ఆహ్వానం పలుకుతున్నా.. శాసనసభలో చర్చ చేద్దాం రండి. సభలో మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుదాం అని సీఎం అన్నారు. ఇదిలావుంటే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చెప్పిందన్నారు. నీటి వాటాలపై అసెంబ్లీలో శుక్రవారం చర్చ జరగనున్న దృష్ట్యా ’నీళ్లు-నిజాలు’ అంశంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం మంత్రి ఉత్తమ్‌ ‌పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ‌పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇతరపథకాలపై ఉత్తమ్‌ ‌వివరణ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.80 వేల కోట్లకుపైగా కావాలి. రూ.80వేల కోట్ల ప్రాజెక్టుపై రూ.27వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా? మేం వచ్చాక రూ.7 వేల కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం త‌ట్టెడు మట్టి తీయలేదని ప్రతిపక్షం దుష్పచ్రారం చేస్తోందని ఉత్తమ్‌ ‌మండిపడ్డారు.



తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page